Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్విమ్ సూట్ లో దంగల్ భామ.. నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నిర్మించిన 'దంగల్' సినిమాలో గీతా ఫొగట్ గా నటించిన ఫాతిమా సనా షేక్ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. అయితే ఊహించని విధంగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. మాల్దీవుల్లో సముద్రపు తీరంలో... స్మిమ్ సూట్లో దిగిన కొన్ని ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను పలువురు నెటిజన్లు లైక్ చేస్తుండగా... మరోవైపు కొందరు మత సంరక్షకులు రంగంలోకి దిగారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి అసభ్యకరమైన ఫొటోలను పోస్ట్ చేస్తావా? అంటూ సనాపై నిప్పులు చెరిగారు. ఆమెను కించపరిచేలా పలు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తనకు నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు ఆమెకు ఉందని చెబుతున్నారు.

More Telugu News